వంగూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బ్యాంకు ఐవోబిలో సేవలు అస్తవ్యస్తంగా మారాయని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. బుధవారం, డిండి చింతపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ సాజిద్ మాట్లాడుతూ, బ్యాంకు సిబ్బంది నగదు ఇవ్వకుండా, ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకోవాలని సూచిస్తున్నారని, వారు 10% కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.