వంగూర్ మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం మహిళలతో ఇందిరా క్రాంతి పథకం సీసీ శంకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గ్రామంలోని మహిళలు, దివ్యాంగులు పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పొదుపు సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వివోఎ మమత, మహిళలు, దివ్యాంగులు పాల్గొన్నారు.