వంగూరు పబ్లిక్ స్కూల్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేటలోని వంగూరు మండల కేంద్రంలో నిర్మిస్తున్న పబ్లిక్ స్కూల్ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను మరింత వేగవంతం చేసి, గడువులోగా స్కూల్ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఈవో రమేష్ కుమార్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕