నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ మాట్లాడుతూ ఓటర్ల విశ్వాసం కోల్పోయిన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రామా అర్జున్, జిల్లా ప్రధాన కార్యదర్శి తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు.