నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ఏడవ వార్డులో ఆదివారం కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ కౌన్సిలర్ గోరెటి శ్రీనివాసులు, రావుల చెన్నకేశవులు, బీస హుస్సేన్, పంబల కుమార్, నరేందర్, ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.