కల్వకుర్తి పట్టణంలో సోమవారం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారుమోని గణేష్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిరసన తెలుపడానికి వెళ్లిన జాగృతి కార్యకర్తలపై తుపాకులతో కాల్పులు జరిపించిన తీన్మార్ మల్లన్న పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు పాల్గొన్నారు.