ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలోని సికెఆర్ ఫంక్షన్ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 5 నుండి 11వ తేదీ వరకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఉచితంగా కంటి అద్దాలు, కంటి శుక్లాల ఆపరేషన్లు చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు. శిబిరం రెండవ రోజు డాక్టర్ రమ్య సౌజన్య సందర్శించారు. నిరుపేదలకు అందిస్తున్న సేవలను కొనియాడారు.