కొల్లాపూర్: సీపీఐ మహాసభలకు తరలి వెళ్ళిన నాయకులు

కొల్లాపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుండి కల్వకుర్తి పట్టణంలో జరిగే మహాసభలకు శుక్రవారం కార్యకర్తలు తరలి వెళ్లారు. నాలుగు బస్సులలో 300 మంది కార్యకర్తలు తరలి వెళ్లినట్లు నాయకులు తెలిపారు. సీపీఐ ద్వారానే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు యూసుఫ్, కోడేరు కార్యదర్శి తపెడ కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్