గత 17 రోజుల నుంచి కొల్లాపూర్ నియోజక వర్గంలోని ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఇండ్లు, ఇండ్ల స్థలాల కొరకై దీక్షలు చేస్తున్న జర్నలిస్టులు 2008లో మంత్రి జూపల్లి కృష్ణారావు జర్నలిస్టుల ఇండ్ల కొరకై మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న స్థలంలో శిలాఫలకం వేశారు. కానీ నేటికీ అక్కడ జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వలేదని శుక్రవారం దీక్ష జర్నలిస్టులు ఆ స్థలాన్ని సందర్శించి ముక్కలుగా పడి ఉన్న ఆ శిలాఫలకానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు.