చికిత్స పొందుతూ మహిళ మృతి

నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్న పొర్ల గ్రామానికి చెందిన ఓ మహిళ, గత నెల 30న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను మక్తల్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈమెకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. ఈ ఘటన కుటుంబంలో విషాదం నింపింది.

సంబంధిత పోస్ట్