నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో శనివారం ఒక ఇంట్లోకి ప్రవేశించిన బ్రాంజ్ బ్యాక్ ట్రీ స్నేక్ ను అటవీ శాఖ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ఇంటి యజమానుల సమాచారం మేరకు జూనియర్ అసిస్టెంట్ సుమన్ పామును పట్టుకుని సహజ ఆవాసంలో విడిచిపెట్టారు. ఈ ఘటనపై జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర (IFS) స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకుని వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.