అచ్చంపేట: AITE-2026.. 42 పులులు నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో అఖిల భారత పులుల అంచనా 2026 సర్వే విజయవంతంగా పూర్తయింది. నవంబర్ 2025 నుంచి జూన్ 2026 వరకు 2,611 చ.కి.మీ. విస్తీర్ణంలో 1,120 ప్రాంతాల్లో 2,240 కెమెరా ట్రాప్‌లతో 8 నెలల పాటు ఈ సర్వే జరిగింది. ఈ విశ్లేషణలో 18 ఆడ, 14 మగ, 2 ఉప-వయోజన, 8 పులి పిల్లలు కలిపి మొత్తం 42 పులులు గుర్తించారు. పులి పిల్లలు, ఉప-వయోజన పులుల ఉనికి రిజర్వ్‌లో పులుల సంతానోత్పత్తి విజయవంతమైందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్