నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామహేశ్వర క్షేత్రానికి భోగమహేశ్వరం నుంచి ఉమామహేశ్వరం వరకు రోడ్డుకు ఇరువైపులా సీసీ రోడ్డు పనుల కోసం రూ.1.30 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. బుధవారం ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.