సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఉరుములతో కూడిన చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచి వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, పెద్ద పెద్ద శబ్దాలకు గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.