నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్దాపూర్ ప్రధాన రహదారి భారీ వర్షానికి సగానికి పైగా కొట్టుకుపోయి పెద్ద గోతి ఏర్పడింది. రోడ్డు ధ్వంసమై నెల రోజులు కావస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజూ వందలాది వాహనాలు ప్రమాద భయం గుప్పెట్లో ప్రయాణిస్తున్నాయని, అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.