అచ్చంపేట: ఉమామహేశ్వర క్షేత్రానికి నిలిచిన రాకపోకలు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామహేశ్వర దేవస్థానం వద్ద తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు ప్రమాదకరంగా విరిగిపడుతున్నాయి. దీంతో, బుధవారం సాయంత్రం దేవాలయ పాలకమండలి ఛైర్మన్ బీరం మాధవరెడ్డి భక్తుల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. కొండపై నుంచి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో రహదారులన్నీ జలమయమయ్యాయని, భక్తులు ప్రస్తుతానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్