కల్వకుర్తిలో దంచికొట్టిన వాన

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంతో పాటు పరిసర మండలాల్లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. వర్షం కారణంగా రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ వర్షంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఉక్కపోత నుండి ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్