కల్వకుర్తి: డ్రంక్ అండ్ డ్రైవ్.. పదిమందికి జైలు శిక్ష

శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన పదిమందికి స్థానిక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. మరో నలుగురికి రూ. 4,600 జరిమానాతో పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. సంపంగి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష, రూ. 600 జరిమానా పడింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ మాధవరెడ్డి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్