కల్వకుర్తి: యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..!

బుధవారం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో రైతులు యూరియా పంపిణీలో కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. సొసైటీకి 700 బస్తాల యూరియా వచ్చినట్లు తెలిసి ఉదయాన్నే సొసైటీకి చేరుకున్న రైతులు, ఆన్లైన్లో బుకింగ్ చేద్దామన్నా అది సాధ్యం కావడం లేదని, కొద్ది సెకన్లలోనే స్టాక్ అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగానే యూరియా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్