నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వంగూర్ మండల కేంద్రంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాలు నీట మునిగాయి. దీంతో కార్యకలాపాలు స్తంభించాయి. గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, కార్యాలయాలు తరచుగా నీట మునుగుతుండటంతో సురక్షిత ప్రాంతాల్లో కొత్త భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.