కల్వకుర్తి: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఉర్కొండ పేట గ్రామ శివారులో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన లిట్టు మాలిక్, అభిమాన్యు మాలిక్ అనే వీరి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, రెండు సెల్ ఫోన్లు, రూ. 59 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు సూర్యలత స్పిన్నింగ్ మిల్ లో మిషన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. వీరిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ నాగార్జున, ఎస్ఐ కృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్