పిచ్చికుక్క బీభత్సం: నాగర్ కర్నూల్ జిల్లాలో 10 మందికి గాయాలు

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లిలో బుధవారం ఓ పిచ్చికుక్క దాడిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులతో సహా సుమారు 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి తెలకపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పిచ్చికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్