పెద్దకొత్తపల్లి మండలంలో అకాల వర్షాల కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేల రాలిన మామిడి కాయలను అమ్ముకునేందుకు సరైన మార్కెట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో పంట పొలాల్లోనే మామిడికాయలు కుళ్ళిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.