
కాంట్రాక్టు సిబ్బందికి సరైన వేతనాలు రావడం లేదని చెప్పగా, చైర్మన్ ఎడ్మ కాంట్రాక్ట్రర్ తో ఫోన్ లో మాట్లాడి కరోనా కాలంలో కూడా ప్రాణాలను లెక్కచేయకుండా డ్యూటీ లు చేసిన వారికి తక్షణమే జీతాలు ఇవ్వాలని, అలాగే వారి జీతాలు పెంచాలని కోరారు. ఆసుపత్రిలోని ప్రసూతి గదిని పరిశీలించారు. టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. డాక్టర్ల తో మాట్లాడి ఇంకా మెరుగైన వైద్యం అందించాలని, రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భోజి రెడ్డి, ఆసుపత్రి కమిటీ మెంబర్ బన్నే శ్రీనివాస్ యాదవ్, డాక్టర్లు శివరాం, యశోద, టిఆర్ఎస్వీ జిల్లా నాయకులు ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.