నాగర్ కర్నూల్: జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలు, నీరు ప్రవహించే ప్రాంతాలు, వాగులు, వంపులు, చెక్ డ్యాముల వద్దకు వెళ్ళరాదని, చెట్ల కింద, కరెంటు వైర్ల వద్ద నిల్చోరాదని తెలిపారు. పాత ఇళ్లు, షెడ్లలో నివసించరాదని, వాహనాలు సరైన కండిషన్లో ఉంచుకోవాలని, అధిక వేగంతో నడపరాదని, హెల్మెట్/సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్