నాగర్ కర్నూల్: కృష్ణానదిలో ప్రయాణం చేసిన కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, తన కుటుంబ సభ్యులతో కలిసి సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో బోట్ ప్రయాణం చేశారు. దాదాపు 6 గంటల పాటు సాగిన ఈ ప్రయాణంలో, నల్లమల్ల అటవీ ప్రాంతంలోని కృష్ణానది అందాలను తిలకించారు. పర్యాటక రంగం అభివృద్ధికి వాతావరణం అనుకూలంగా ఉందని, సోమశిల-శ్రీశైలం పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తుందని కలెక్టర్ అన్నారు. మత్స్యకారులు చేపలు పట్టే విధానాన్ని కూడా ఆయన ఆసక్తిగా గమనించారు.

సంబంధిత పోస్ట్