నాగర్ కర్నూల్ జిల్లాలో మే 11 నుంచి 26 వరకు విద్యా వారోత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాతో కలెక్టర్ పాల్గొన్నారు. బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.