నాగర్ కర్నూల్: అధికార పార్టీకి 'రెబల్స్' టెన్షన్..!

నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు రెబల్స్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. జిల్లాలోని పలు గ్రామాల్లో పార్టీ నాయకులే రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేయడంతో, వారిని బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడానికి పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇద్దరు పోటీలో ఉండటం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. నామినేషన్ల ఉపసంహరణకు రేపు చివరి రోజు గడువు ఉంది.

సంబంధిత పోస్ట్