నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కోండ మండల కేంద్రంలో, ఊర్కొండను కల్వకుర్తిలోనే కొనసాగించాలని కోరుతూ అఖిల పక్ష జేఏసీ నాయకులు శనివారం దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి కల్వకుర్తి వాసి కాబట్టి, కల్వకుర్తిని జిల్లాగా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ దీక్షకు అన్ని పార్టీల నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష జేఏసీ నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.