నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎవరైనా సోషల్ మీడియా లేదా వాట్సాప్ గ్రూపులలో ఇతరులను కించపరిచే లేదా రెచ్చగొట్టే పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై కృష్ణదేవ హెచ్చరించారు. అభ్యర్థులతో పాటు గ్రూప్ అడ్మిన్లపై కూడా చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు.