వంగూరు మండలం మిట్ట సదగోడు తెలుగు పడి కాడెద్దులు మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మహేష్ తన వ్యవసాయ పొలంలో నాగలి దున్నుతుండగా భారీ వర్షం కురిసింది. వర్షానికి ఎద్దులను చెట్టు కింద కట్టేసి తాను పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్లారు. ఇంతలోనే చెట్టుపై పిడుగు పడి ఎద్దులు చనిపోయాయని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.