నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ రైతులకు అండగా నిలుస్తూ, తడిసిన వరి, మక్కలు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా OPMS నమోదు, ట్రక్ షీట్లు, లోడింగ్, అన్ లోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం అచ్చంపేట నియోజకవర్గంలోని చెన్నారం, నడింపల్లి గ్రామాల్లోని కాటన్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి, నిల్వ సామర్థ్యం, కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.