అమెరికాలో నల్గొండ విద్యార్థిని అదృశ్యం

TG: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నల్గొండ యువతి శ్రీజారెడ్డి(23) అదృశ్యమైంది. శ్రీజ అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. ఈ నెల 2న రాత్రి 9:45 గంటల సమయంలో డోర్చెస్టర్‌లోని ఎడిసన్ గ్రీన్ నివాసం నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో 3న అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన బోస్టన్ పోలీసులు శ్రీజా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్ ప్రాంతాల్లో ఆమె ఫోన్ సిగ్నల్ చూపించినట్లు గుర్తించగా ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕