ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య

యాదాద్రి జిల్లా ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత పనులు చేసే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని గంధమల్ల రవిగా (38) గుర్తించారు. యాదగిరిగుట్ట బీర్ల ఐలయ్య సొంత నివాసంలో మూడో అంతస్తులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్