ఆలేరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ యార్డు సమీపంలో సోమవారం రైలు ఢీకొట్టిన ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి(55) మృతి చెందాడని భువనగిరి రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి కృష్ణారావు చెప్పారు. సోమవారం ఉదయం 11. 30గంటల సమయంలో సదరు వ్యక్తి రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో కాజీపేట్ వైపు నుంచి వచ్చిన వందేభారత్ రైలు ఢీకొట్టడంతో మృతిచెంది ఉంటాడని తెలిపారు. మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచామన్నారు.

సంబంధిత పోస్ట్