యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం. పట్టణ శివారు మల్లాపురం రహదారి పక్కన పశువుల కొట్టం వద్ద గుర్తుతెలియని వ్యక్తి (65) మృతి చెంది ఉండడాన్ని రైతు ఆవుల కృష్ణ గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంత కాలంగా యాదగిరిగుట్టలో భిక్షాటన చేస్తున్నట్లుగా తెలిసింది. కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.