గురువారం హైదరాబాద్ పెద్ద అంబర్పేట్ లో తప్పిపోయిన నలుగురు పిల్లలు శుక్రవారం యాదగిరిగుట్ట మండలం దాతర్ పల్లి వ్యవసాయ బావి వద్ద స్నానం చేస్తుండగా గ్రామస్తులు చూసి పోలీసు వారికి సమాచారం అందించారు. యాదగిరిగుట్ట పోలీసులు ఆ నలుగురు బాలురను సురక్షితంగా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి విచారించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ నలుగురు పిల్లలు సురక్షితంగా పోలీసులు వద్ద ఉన్నారు.