విహారయాత్రకు వెళ్లేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్థాపంతో ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక యాదగిరి పల్లికి చెందిన గంగాధర్ భరత్ (17) ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసుకున్నాడు. విహారయాత్రకు వెళ్తానని తల్లిదండ్రులను అడిగాడు. ఇప్పుడు టూరుకు ఎందుకని తల్లిదండ్రులు మందలించడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.