యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బుధవారం భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 51.13 కిలోల గంజాయిని భువనగిరి పోలీసులు పట్టుకున్నారు. 24 ప్యాకెట్ల గంజాయి మొత్తం విలువ రూ. 14 లక్షల 50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులు మహమ్మద్ ఆమిర్, మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ ఇస్మాయిల్ పట్టుబడ్డారు. భాష అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి కారు, ముగ్గురు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.