యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం శివారులో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందడం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని వయసు దాదాపు 45 ఏళ్ళు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. గత 3 రోజుల క్రితం తూప్రాన్ పేట శివారులో కళ్ళు కోసం తిరిగాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్ పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.