యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగిలో హైదరాబాద్ జాతీయ రహదారి పెట్రోల్ బంకులో నీళ్లు వచ్చాయి. ఆరెగూడెం గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి లక్ష్మియాదగిరి పెట్రోల్ బంకులో రూ. 100 పెట్రోలు తన ద్విచక్ర వాహనంలో పోసుకున్నాడు. బంకు నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో ద్విచక్ర వాహనం ఆగిపోయింది. ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో ద్విచక్ర వాహనం పెట్రోల్ ను బాటిల్లోకి తీసుకొని పరీక్షించగా నీళ్లు వచ్చాయి.