భువనగిరి హైవేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.