వలిగొండ: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలోని భీమలింగం కత్వ వద్ద బుధవారం చోటు చేసుకుంది. ముసి నదిపై ఉన్న భీమలింగం కత్వా వద్ద స్థానికులు ఓ మృతదేహంను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి శవ పరీక్ష నిమిత్తం రామన్న పేట ఆసుపత్రికి తరలించారు. కొట్టి చంపి నీటిలో పడేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్