వలిగొండ: తాపీ పనులు చేస్తూ వ్యక్తి మృతి

తాపీ పనులు చేస్తూ ఆకస్మాత్తుగా పడిపోయి మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వేములకొండలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన చిన్నపాక బాబు(43) తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తాపీ పనులు చేస్తూ గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా పడి పోయాడు. చికిత్స నిమిత్తం రామన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్