వలిగొండ: గురువారం వలిగొండ-నాగారం గ్రామాల మధ్య ఉన్న మూసీనదిలో చేపలకు వెళ్లిన ఇద్దరు పిల్లలు, ప్రమాదవశాత్తు వరద నీటిలో మునిగి గల్లంతు అయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరొక బాలుని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కళ్లెం స్వామి సువర్ణ దంపతుల కుమారుడు చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. కళ్లెం దశరథ అలివేలు దంపతుల పెద్ద కుమారుడు నీటిలో కొట్టుకపోయి ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి.