వలిగొండ: పాము కాటుతో మహిళ మృతి

యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గురునాధ పల్లె గ్రామంలో పాము కాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన తోట జయమ్మ (65). ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుకు గురైంది. చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించగా మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగేంధర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్