యాదాద్రి: రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం

నడికుడి నుండి కాచిగూడ వెళ్లే డెమో ప్యాసింజర్ గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో రైలు భువనగిరి నుండి నాగిరెడ్డిపల్లి సమీపంలోకి చేరుకోగానే రైలు బోగీల చక్రాల సమీపంలో మంటలు చెలరేగాయి. గమనించిన ట్రాక్ మాన్ బీబీనగర్ స్టేషన్ మాస్టర్ కు సమాచారం ఇవ్వగా, రైలు బీబీనగర్ స్టేషన్ లో ఆగగానే పైలట్, స్టేషన్ సిబ్బంది, ప్రయాణికులు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పారు. సకాలంలో మంటలు ఆర్పడం వలన పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్