యాదాద్రి: ప్రైవేట్ లాడ్జిలో మహిళ మృతి

యాదగిరిగుట్టలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఒక మహిళ మృతిచెందినట్లు లాడ్జి నిర్వాహకుడు భరత్ పోలీసులకు తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం సదరు మహిళ, మరో వ్యక్తి గదిని అద్దెకు తీసుకున్నారు. శనివారం ఉదయం 5.40 సమయంలో అతను వెళ్ళిపోయాడు. ఎంతకీ తిరిగి రాలేదు. అనుమానం వచ్చి భరత్ చూడగా మహిళ మృతి చెంది ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్