యాదగిరి గుట్ట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని అంగడి బజార్ లో ఐదో వార్డులో ఇంటి ముందట పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఇరుగుపొరుగువారు చూసి మంటలను ఆర్పి వేశారు. అప్పటికే మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైంది. రాత్రి వేళలో పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ చేయాలని స్థానికులు కోరుతున్నారు.