రాష్ట్రంలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, నల్గొండ, సూర్యపేట, ఉమ్మడి వరంగల్, HYD, రంగారెడ్డి, ఉమ్మడి MBNR, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.